15-07-2025 01:45:23 PM
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. దంపతుల మధ్య పెద్దమనుషుల పంచాయితీలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. వివాదం ముదరడంతో ఇదరు వర్గాలు కత్తులతో దాడు చేసుకున్నాయి. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన మల్లేశ్, గణేశ్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. అమ్మాయి వర్గం సుపారీ ముఠాను తీసుకువచ్చారని అబ్బాయి వర్గం ఆరోపించింది. దాడి అనంతరం అమ్మాయి వర్గం అక్కడి నుంచి పారిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.