15-07-2025 02:42:33 PM
ప్రభుత్వాలు మారిన విధానాలు మారలేదు
హైదరాబాద్: జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకే ఒక గుర్తింపును తీసుకొచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పేర్కొన్నారు. దేశంలోనే వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33 శాతం కేవలం జోనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్.. ప్రపంచాన్నే భయపెడుతున్న సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచి వ్యాక్సిన్లు తయారు చేశామని చెప్పారు. జీనోమ్ వ్యాలీ నుంచి ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయగలిగామని పేర్కొన్నారు. దాదాపు 100 దేశాలకు వ్యాక్సిన్లు అందించామంటే జీనోమ్ వ్యాలీ( Genome Valley) పరిశ్రమలదే ఆ గొప్పతనం అన్నారు. ప్రభుత్వాలు మారినా విధానాలు మారలేదని సీఎం స్పష్టం చేశారు. 1994 నుంచి పదేళ్ల టీడీపీ, పదేళ్లు కాంగ్రెస్, పదేళ్లు బీఆర్ఎస్ ఉన్నా.. పరిశ్రమల విధానాల్లో ఏమార్పు చేయలేదని వివరించారు. జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజికల్స్ కొత్త యూనిట్ భూమి పూజ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.