15-07-2025 02:10:51 PM
న్యూఢిల్లీ: భారత్ కు చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియ(Kerala nurse Nimisha Priya) ఉరిశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేసినట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ, జూలై 16న జరగాల్సిన కేరళకు చెందిన ఉరిశిక్షను ఇప్పుడు నిలిపివేసినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. యెమెన్ లో కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. యెమెన్ లోని స్థానిక జైలు అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నామని ఎంఈఏ ప్రకటించింది. ఇరువర్గాలకు ఆమోదయోగ్య పరిష్కార సాధనకు మరింత సమయం కోరామని ఎంఈఏ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం నిమిష ప్రియ ఉరిశిక్ష అమలు కావాల్సిఉంది. నిమిష ప్రియ విషయంలో విదేశాంగ శాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.