17 April, 2026 | 11:18 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

బొమ్మనపల్లి గ్రామ శివారులో వ్యక్తి మృతి

27-03-2025 11:08 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామ సమీపంలోని కారుకొండ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న జామయిల్ యార్డు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపి రాష్ట్రం వత్సవాయి మండలం, ఖమ్మంపాడు గ్రామానికి చెందిన బండి రామకృష్ణ (50) అనే వ్యక్తి టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామ పంచాయితీ పరిధి కారుకొండ క్రాస్ రోడ్ వద్ద జామయిల్ యార్డు వద్దకి గురువారం మధ్యాహ్నాం వచ్చిన రామకృష్ణ కాసేపు పడుకొని ఒక్కసారిగా నాకు ఊపిరి ఆడట్లేదాని అంటూ కూర్చొని మళ్ళీ పడిపోయాడు. అంబులెన్సులో వచ్చిన వైద్య సిబ్బంది చనిపోయాడని తెలిపారు. మృతుడి వద్ద బట్టలు, టాబ్లెట్స్, సెల్ఫోన్ సహాయంతో అడ్రస్ గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. బాడీని కొత్తగూడెం మార్చురికి తరలించినట్లు తెలిపారు.