అప్పు ఇచ్చిన డబ్బు విషయంలో గొడవ.. స్నేహితుడి హత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్( Rajendra Nagar police station) పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మృతుడిని సాయి కార్తీక్ గా గుర్తించారు. అప్పు ఇచ్చిన డబ్బు విషయంలో గొడవపడి కార్తీన్ ను స్నేహితుడు హత్య చేశాడు. మిత్రుడు సిద్ధార్థ్ రెడ్డి వద్ద సాయి కార్తీక్ రూ. 8 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బు తిరిగి అడిగితే సాయి కార్తీక్ ఇవ్వకుండా బెదిరింపులకు దిగాడు. మద్యం మత్తులో గొడవపడి సాయి కార్తీక్ పై సిద్ధార్థ్ రెడ్డి దాడి చేశాడు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు(Rajendra Nagar police) కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.






