08-11-2025 07:40:03 PM
చేగుంట (విజయక్రాంతి): ట్రాక్టర్ బైకు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట శివారులోని జీవిక పరిశ్రమ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. చేగుంట మండలంలోని కరీంనగర్ గ్రామానికి చెందిన చాకలి భూమేష్ చేగుంట నుండి స్వగ్రామం వెళ్తుండగా మార్గమధ్యలో జీవక పరిశ్రమ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో భూపేష్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ లో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకొని చేగుంట ఎస్సె చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.