08-11-2025 07:38:57 PM
కత్తితో అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన దుండగులు
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): వివాహిత మహిళను పదునైన కత్తితో అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దుండిగల్ సీఐ పి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా తిమ్మాపూర్ కు చెందిన సుజాత (30) ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటుంది. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు తలెత్తడంతో భర్తతో దూరంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండడం,ఆ వ్యక్తితో కూడా తనకు గొడవలు జరుగుతున్నట్లు సీఐ తెలిపారు. అయితే అతనికి సంబంధించిన వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ అనే వ్యక్తి మహిళను హత్య చేసినట్లు పోలీసులకు లొంగిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ తెలిపారు.