30-01-2026 03:19:22 PM
పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు
కారేపల్లి,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ లారీ వస్తున్న విషయం గమనించకుండా లారీని ఢీకొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలు అయిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి కామేపల్లి మండల పరిధిలోని జోగ్గూడెంలో పోస్ట్మాస్టర్ గా పనిచేస్తున్న వారణాసి ప్రవీణ్ కుమార్ విధులలో భాగంగా ఉత్తరాలను క్రాస్ రోడ్డు లో బట్వాడా చేసేందుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో క్రాస్ రోడ్ మూలమలుపు తిరుగుతుండగా ఖమ్మం నుండి కారేపల్లి వెళుతున్న లారీని ఢీకొట్టగా కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి.
తలకు తీవ్ర గాయాలు కాగా కారేపల్లి ఎస్సై బైరు గోపి వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని పోలీసు వాహనంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారణాసి ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల వాసి. కాగా పోస్టల్ శాఖలో నాలుగు నెలల క్రితమే పోస్ట్మాస్టర్ గా ఉద్యోగం పొంది కామేపల్లి మండల పరిధిలోని జోగ్గూడెం గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.