6 July, 2026 | 2:09 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించండి

19-06-2025 10:26 PM

మహబూబ్ నగర్ రూరల్: తీసుకున్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్(Mudiraj Mahasabha District President Mettukadi Prabhakar) అన్నారు. గురువారం మండల పరిధిలోని రామచంద్రపురంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ గ్రామ సంఘం అధ్యక్షునిగా వరద దశరథ్, జనరల్ సెక్రెటరీగా బోయిన్ ఆంజనేయులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముదిరాజులు జనాభాపరంగా అధిక సంఖ్యలో ఉన్న రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముదిరాజులను బీసీ డీ నుంచి ఏ గ్రూప్ కు మారుస్తామని హామీ ఇచ్చి అది నెరవేర్చకుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంల  మండల అధ్యక్షులు తుపాకుల చంద్రుడు, బోల యాదయ్య, వల్లరి కిట్టు తదితరులు ఉన్నారు.