calender_icon.png 11 November, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట విక్రయాల్లో నిబంధనలు సడలించాలి

11-11-2025 12:51:10 AM

మంత్రి తుమ్మలకు బీజేపీ ఎమ్మెల్యేల వినతి

ఆదిలాబాద్, నవంబర్ 10 (విజయక్రాం తి):  పత్తి, సోయా, మొక్కజొన్న పంటల విక్రయాల్లో నిబంధన సడలించి రైతుల నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. సోమవారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిసి హైదరాబాద్ లోవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల సోయాబీన్ పంట నాణ్యత కొద్దిగా దెబ్బ తినడం వల్ల కొనుగో లు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ మంత్రి దృష్టికి తీసు కెళ్లారు.

పంటను విక్రయించేందుకు రైతే రావాలని నిబంధనలు ఉండడంతో కొంతమంది వృద్ధులు,  మహిళలు రాలేని పరిస్థితి ఉందని అలాంటి సమయంలో వారి కుటుంబీకులకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. పత్తి పంటను ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు విక్రయించేందుకు అవకాశం ఉండేదని, కానీ దాన్ని 7 క్వింటాళ్లకు కుదించడంతో రైతుల నష్టపోతున్నారని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం 12 క్వింటాళ్ల పరిమితికి సన్నద్ధతో ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి పరిస్థితులు వివరిస్తూ లేఖ రాస్తే కేంద్ర ప్రభు త్వం ఆమోదిస్తుందని ఆయన మంత్రితో విన్నవించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో చాలామంది పరంబోకు భూముల్లో పం టలు సాగు చేశారని వీరితో పాటు అనేకమంది రైతులు ఇతర రైతుల భూములను కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశారని వారి పేర్లు సర్వేలో లేకపోవడం వల్ల పంటలను విక్రయించుకోలేకపోతున్నారని ఆయ న మంత్రికి వివరించారు.