calender_icon.png 24 August, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పా?

11-12-2024 11:51:08 AM

హైదరాబాద్: తన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తనను బాధపెడుతున్నారని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పా? అని మంచు మనోజ్ ప్రశ్నించాడు. ఏమీ ఆశించకుండా తన కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపాడు. వేరొకరి కడుపుకొట్టి తన కడుపు నింపుకునే రకం తాను కాదని వివరించాడు. పోలీసుల విచారణ తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తానని చెప్పాడు. అటు పహాడీషరీఫ్‌లో స్థానిక న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌పై మంగళవారం రాత్రి దాడి చేసినందుకు సినీ నటుడు మంచు మోహన్‌బాబుపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. రిపోర్టర్ ముప్పిడి రంజిత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పహాడీషరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై బీఎన్ఎస్ సెక్షన్ 118 కింద కేసు నమోదు చేశారు.