11-12-2024 10:42:09 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో జైపూర్ వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రాజస్థాన్ కు పయనం కానున్నారు. ఇవాళ రాత్రి జరిగే బంధువుల విహహానికి సీఎం హాజరుకున్నారు. గురువారం ఉదయం రాజస్థాన్ నుంచి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశముంది. కేబినెట్ విస్తరణపై పుకార్లు వెల్లువెత్తుతుండగా, డిప్యూటీ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ బీ మహేశ్ కుమార్ గౌడ్‌లు ఢిల్లీలో ఆయనతో కలుస్తారా లేదా అన్నది అస్పష్టంగానే ఉంది. రేపు పలువురు కేంద్రమంత్రులను రేవంత్ రెడ్డి కలసి రాష్ట్రానికి రావాల్సిన నిధిలపై చర్చించే అవకాశముంది. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు ముందు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో ఆయన నివాసంలో సుదీర్ఘంగా సమావేశమై పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో, మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.