హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న మందకృష్ణ మాదిగకు ఎంఆర్పీఎస్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ నుంచి బషీర్ బాగ్ కూడలి వరకు భారీగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మందకృష్ణ మాదిగతో పాటు మోత్కపల్లి నర్సింహులు, పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సభ నిర్వహించనున్నారు.