calender_icon.png 22 August, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిటీ కుర్రోళ్లు టీమ్ కు రామ్ చరణ్ శుభాకాంక్షలు

13-08-2024 05:02:11 PM

ఇటీవల విడుదలై మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది కమిటీ కుర్రోళ్లు.మెగా కూతురు నిహారిక కొణిదెల నటించిన కమిటీ కుర్రోళ్లు అందరిని ఆకట్టుకుంటోంది. నూతన దర్శకుడు యదు వంశీ దర్శకత్వంలో 11 మంది కొత్తవారు నటించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టు కుంటోంది. సినిమా కథాంశం సినిమా ప్రేమికులను చిన్ననాటి బాల్యాన్ని గుర్తుకు తెస్తుందన్నారు. బాల్యంతో ముడిపడి ఉన్న అమాయకత్వం  ప్రేక్షకులను వినూత్న ప్రపంచంలోకి  తీసుకువెళుతుంది.

తారాగణం:

గోదావరి నేపధ్యం కథలో ఉన్న జాతర సన్నివేశాలు   అద్భుత మైన అనుభవాన్నిచ్చాయి. చిత్ర నిర్మాణంలో  సాయి కుమార్, గోపరాజు రమణ,  శ్రీలక్ష్మి , నూతనంగా వచ్చిన సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్ ,రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగమంతూరి, బలగం జయరామ్, కాచెరపాలెం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.