calender_icon.png 17 July, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రమంత్రి వివేక్ ను అభినందించిన మండల కాంగ్రెస్ నాయకులు

18-06-2025 05:28:36 PM

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర, కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy)ని మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఇటీవల రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, బుధవారం హైదరాబాద్ సచివాలయంలోని తన చాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ కడారి జీవన్ కుమార్, మండల నాయకులు మాసు సంతోష్ కుమార్, దుర్గం కుమార్, బచ్చల రాములు, గజ్జ మహేందర్ లు పాల్గొన్నారు