29-01-2026 12:45:47 AM
మాగనూరు. జనవరి 28: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలు గురువారము నుంచి ప్రారంభించనున్నట్లు పిడి రాకేష్ శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించే పోటీల్లో కో కో, వాలీబాల్ ,అట్లాంటిక్స్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను జిల్లా కేంద్రంలో జరిగే క్రీడల్లో పాల్గొంటారని వారికి తెలిపారు.