calender_icon.png 29 January, 2026 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్నాపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు

29-01-2026 12:46:57 AM

పటాన్ చెరు, జనవరి 28 :పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో బుధవారం సుమారు 50 మంది యువ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇస్నాపూర్ ఇంచార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఇంద్రేశం ఇంచార్జ్ శ్రీనివాస్ యాదవ్, పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పని చేస్తోందని, రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుమార్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, మల్లా రెడ్డి, తెల్లాపూర్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, వెలిమల మాజీ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ యువజన నాయకులు మెరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.