29-01-2026 12:45:07 AM
నామినేషన్ చివరి రోజు బిఫాం సమర్పించాల్సిందే
మున్సిపాలిటీలో జోరుగా నామినేషన్లు
నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు
మెదక్, జనవరి 28 (విజయ క్రాంతి) :మున్సిపాలిటీలో ఎన్నికల జాతర మొదలైంది. షెడ్యూల్ విడుదలతో ఒక్కసారిగా పట్టణాల్లో రాజకీయం వేడెక్కింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధిలో బుధవా రం వార్డుల వారీగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. దీంతో ఆశావహులు అన్నీ సిద్ధం చేసుకొని నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు, రేపే నామినేషన్లు ...
నామినేషన్ దాఖలుకు రెండు రోజులే ఉంది. నామినేషన్ వేసినా బి ఫాం ఇస్తేనే పా ర్టీ అభ్యర్థిగా వార్డులో ప్రచారం చేసుకోవచ్చు. అధికార కాంగ్రెస్ తో పాటు బిఆర్ ఎ స్, బీజేపీ, ఇతర పార్టీలో ఇంకా ఎక్కడ అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయలేదు. బి ఫాం అందుకునే వరకు అభ్యర్థులో టెన్ష న్ తప్పడం లేదు.
పార్టీ పరంగా టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయం పెట్ మున్సి పాలిటీలో ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయడంలో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు తర్జన భర్జన పడుతున్నారు.
అంతా సిద్ధం. ..
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధి లో 75 వార్డుల్లో 150 పోలింగ్ కేంద్రాలున్నాయి. మొత్తంగా 87వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 45,307 మంది ఓటర్లు కాగా, పురుషులు 42,306 మంది ఉన్నారు. జిల్లాలోని మెదక్ మునిసిపాలిటీలో 32 వార్డు లు ఉండగా, 64 పో లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17,580 మంది పురుషులు, 19,435 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు.
మొత్తంగా 37,016 మంది ఓటర్లు ఉన్నారు. అదే విధంగా మెదక్ మునిసిపాలిటీలో 64 మం ది పీఎస్లు, 64 మంది పీవోఎస్లు, 64 మంది ఏపీవోస్లు, 192 మంది ఓపీవోఎస్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్ననున్నారు. రామాయంపేట మునిసిపాలిటీలో 12 వార్డు లు ఉండగా, 24 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 6298 మంది పురుషులు, 6808 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 13,106 మంది ఓటర్లు ఉన్నారు.
ఇందులో 24 మంది పీఎస్లు, 24 మంది పీవోఎస్, 24 మంది ఏపీవోస్, 72 మంది ఓపీవోస్లు విధులు నిర్వర్తించనున్నారు. నర్సాపూర్ మునిసిపాలిటీలో 15 వార్డులకు 30 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 8328 మంది పురుషు లు, 8737 మంది మహిళలు ఉండగా, ఇతరులు ఒకరు ఉన్నారు. మొత్తం 17066 మం ది ఓటర్లు ఉన్నారు. 30 మంది పీఎస్, 30 మంది పీవోస్, 30 మంది ఓపీవోస్, 90 మంది ఓపీవోస్లు ఉన్నారు.
తూప్రాన్ మునిసిపాలిటీలో 16 వార్డు లు, 32 పోలింగ్ కేంద్రాల్లో ఉండగా, 10,100 మంది పురుషులు, 10,327 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 20427 మంది ఓటర్లు ఉన్నారు. 32 పీఎస్, 32 పీవోఎస్, 32 పీవోఎస్, 96 ఓపీవోస్లు ఉన్నారు. మొత్తంగా జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో 75 వార్డులు, 150 పోలింగ్ కేంద్రాలు, 87,615 మంది ఓటర్లు ఉన్నారు.