calender_icon.png 21 November, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

21-11-2025 06:26:49 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటూ శాస్త్రీయ దృక్పథoతో విద్యార్థులు ఎదిగినట్లయితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఎంఈఓ సోమయ్య అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోస్టర్లను విడుదల చేశారు.

చిన్నతనం నుంచే విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తేనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనారు. ఈ కార్యక్రమంలో టీయుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరాం, ఏఎస్ఓ గోవర్ధన్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్, జిల్లా అధ్యక్షులు  ఉమాకాంత్, జిల్లా నాయకులు గంగయ, ఆత్రం సంతోష్ కుమార్, నాగరాజు, నారాయణ, లింగారెడ్డి, లిటిల్ ఫ్లవర్ కరస్పాండెంట్ దేవేందర్ పటాస్కర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.