calender_icon.png 21 November, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్

21-11-2025 06:05:04 PM

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్

హుజురాబాద్,(విజయక్రాంతి): విద్యార్థుల సమస్యల పరిష్కారానికై పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని జిల్లా అధ్యక్షుడు రామారావు వెంకటేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఏఐఎస్ఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ... దేశంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని నేడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి.

పేద మధ్యతగతి వర్గాల విద్యార్థులు చదువుకోవడం భారంగ ఉందని పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని  అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ లో చేరగా వారికి సభ్యత్వం ఇచ్చి ఏఐఎస్ఎఫ్ లోకి ఆహ్వానించారు.  ప్రైవేట్ విద్యాసంస్థలు అక్షరాలతో విద్య వ్యాపారం చేస్తున్నారని విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతూ వారు చేసే దోపిడీకి కొమ్ముకాస్తున్నారు.

వేలాది రూపాయలు వసూలు చేస్తూ కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు మూడు సంవత్సరాలుగా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెంచిన ఆర్టీసీ బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని, ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని  పిలుపనిచ్చారు.