21-11-2025 05:31:25 PM
జాతీయ నాయకురాలు పశ్య పద్మ
వలిగొండ,(విజయక్రాంతి): వందేళ్లు ఘనమైన చరిత్ర గలిగిన ప్రజా ఉద్యమాల సారధిగా నిలిచిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని జాతీయ నాయకురాలు పశ్య పద్మ గారు అన్నారు. గురువారం సిపిఐ పార్టీ వంద సంవత్సరాలు ముగింపు ఉత్సవాల సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో పశ్య పద్మ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ పట్టణంలో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించబడింద అన్నారు.
వంద సంవత్సరాలు ముగింపు ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో డిసెంబర్ 26న భారీ బహిరంగ సభను భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తోంది అని అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వాల ఆగ్రహానికి గురై ఆనాడు సిపిఐ పార్టీ నేతలపై అనేక కుట్ర కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారని అయినప్పటికీ వెనకడుగు వేయకుండ వారితో పోరాటం చేసి ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో సమీకరించి పోరాటంలో అన్ని వర్గాల ప్రజలను సమీకరించి వారి నుండి విముక్తి కొరకు పోరాడిన పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు.