21-11-2025 05:59:21 PM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): పట్టణంలో ఇటీవల నూతనంగా ఎన్నిక కాబడిన శ్రీ రాజరాజేశ్వర ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ వారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను మహాలింగేశ్వర గార్డెన్స్ లో ఘనంగా సన్మానించారు. అనంతరం వేములవాడ పట్టణ చెందిన బిజెపి నాయకులు వేములవాడ ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సరిపెల్లి కార్తీక్ లిక్కిడి జితేందర్ ఆధ్వర్యంలో వారి మిత్రబృందం 50 మంది ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాగ వారికి విప్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.