21-11-2025 06:30:26 PM
బైంసా,(విజయక్రాంతి): సర్వీస్ లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి టెట్ పరీక్ష నుండి మినాయింపు ఇవ్వాలని జిల్లా ప్రధాన కార్యదర్శి బివి రమణ అన్నారు. 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పనిచేస్తున్న వారికి టెట్ పరీక్ష నుండి మినాయింపు ఇవ్వడానికి ఆ దిశగా పార్లమెంటులో చట్ట సవరణ చేయడానికి గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 సంవత్సరానికి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నిరాయింపు ఇవ్వాలన్నారు.
చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వం ప్రతినెల 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన హామీ నీ కూడా విస్మరించారని అన్నారు డిసెంబర్ 9 లోపల ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్ర సంఘ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు టీ గంగ మోహన్ మండల అధ్యక్షులు ఎస్ గంగాధర్ ప్రధాన కార్యదర్శి కృష్ణ మండల ఉపాధ్యక్షులు బాబురావు శ్రీనివాసరావు సునీల్ ప్రధానోపాధ్యాయులు కే గంగాధర్ మరియు భూమేష్ రాములు సురేఖ రేణుక హనుమాన్లు లక్ష్మీకాంత్ సిందే భూపతి నరేష్ శ్రీకాంత్ సి అర్ పి పోతన గార్లు మరియు తదితర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు