21-11-2025 05:28:38 PM
వలిగొండ,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు సహకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వలిగొండ మండలంలో పెద్ద ఎత్తున ధాన్యం పండించడం జరిగిందని అయినప్పటికీ ధాన్యం కొనుగోలను ముమ్మరంగా చేయడం జరిగిందన్నారు. అయితే మిల్లర్లు ఇందుకు సహకరించి త్వరగా దిగుమతులు చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, డిప్యూటీ తహసిల్దార్ పల్లవి, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి, ఆర్ఐ నగేష్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్ పాల్గొన్నారు.