21-08-2025 04:33:26 PM
గుండాల (విజయక్రాంతి): గుండాల మండల స్థాయి క్రీడల నిర్వహణ, సెలెక్షన్స్ సన్నాహక సమావేశానికి మండల విద్యాధికారి మన్నె అగ్గి రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్రీడల షెడ్యూల్ విడుదల చేశారు. ఆగస్టు 25, 26 తేదీలలో అండర్-14, 17 సంవత్సరాల బాల బాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు. క్రీడలలో పాల్గొనే విద్యార్థులు 14 సంవత్సరాల విభాగంలో 01-01-2012 లోపు, 17 సంవత్సరాల విభాగంలో 01-01 2009 లోపు జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఈ క్రీడా కార్యక్రమాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండాలలో నిర్వహిస్తామన్నారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్లతో రావాలని తెలిపారు. సమావేశంలో వ్యాయామ ఉపాద్యాయులు నర్సిరెడ్డి, అమరేందర్, బాలరాజు, కృష్ణవేణి, మహేష్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.