21-08-2025 07:22:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఆది కర్మయోగి అభియాన్ కింద ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) వెల్లడించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన జనాభాకు విద్య, వైద్యం, మౌలిక ఆర్థిక సదుపాయాలు అందించడంతో పాటు, గ్రామ స్థాయిలో పాలనను బలోపేతం చేయడం అభియాన్ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గిరిజనులు వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రతీ ప్రభుత్వ పథకం ప్రతి అర్హుడి వరకు చేరేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాల ద్వారా చైతన్యం తీసుకురావాలన్నారు. 18 లైన్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాకు చెందిన 7 మంది మాస్టర్ ట్రైనర్లు హైదరాబాద్‌లో ప్రత్యేక j పి.రామారావ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా మత్స్యశాఖ అధికారి జి. రాజ నర్సయ్య, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, పశుసంవర్ధక శాఖ అధికారి రాజేశ్వర్, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి సందీప్, వైద్య శాఖ అధికారులు సౌమ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.