calender_icon.png 11 July, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఐ పనితీరుపై అనేక ఆరోపణలు

11-07-2025 12:00:00 AM

  1. మొన్న సివిల్ కేసులో అత్యుత్సాహం నేడు ఫిర్యాదు చేసిన పట్టని వైనం. 

ఇది పాల్వంచ రూరల్ ఎస్సై పనితీరు 

ఇటీవల పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామంలో భూవివాదంలో బాధితులకు విరుద్ధంగా వ్యవహరించారని, సివిల్ కేసులో అతి ఉత్సాహం చూపుతున్నారని ఆరోపణ కొనసాగుతోంది. నేడు స్వయంగా తల్లి కుమారుడి అదృశ్యంపై అందుకు కారణమైన ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు చేసి నెలరోజులు దాటిన కనీసం విచారించకపోవడంపై ఎస్‌ఐ పనితీరు పై బాధితుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇవి కేవలం మచ్చుతునకలు మాత్రమే. వెలుగులోకి రాని ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఎస్పీ ఆదేశాలు కేవలం ప్రచారానికే నా, ఆచరణలో ఉండవా అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇప్పటికైనా ఎస్పి రోహిత్ రాజ్ పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పై నజర్ వేయాలని వారు వేడుకుంటున్నారు.