calender_icon.png 11 July, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస

10-07-2025 11:18:53 PM

ఎల్బీనగర్: సైబర్ నేరాలకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యపరుస్తున్న ఎల్బీనగర్ సైబర్ వారియర్ వైష్ణవి మహిళా కానిస్టేబుల్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(Rachakonda Police Commissioner Sudheer Babu) అభినందించి, రివార్డు అందజేశారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తలపెట్టిన విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా "సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన, అప్రమత్తత"పై ప్రతిరోజూ ప్రజలకు ఎల్బీ నగర్ పోలీస్ అవగాహన కల్పిస్తున్నారు.

సైబర్ నేరస్తులు పన్నే వలలో పడకుండా ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు, లోన్ యాప్ లు, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే లింకులను తెరవడం ద్వారా మనకు జరిగే నష్టం, మనల్ని భయాందోళనకు గురిచేసి మన బలహీనతలను ఏ విధంగా నేరస్తులు ఒక అవకాశంగా మలచుకుంటారో తెలియపరుస్తూ అద్భుతంగా అవగాహన కల్పిస్తున్న ఎల్బీనగర్ పోలీసులను రాచకొండ కమిషనర్ ప్రశంసించారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఎంపికైన వైష్ణవి అనే మహిళా కానిస్టేబుల్ ని ఎల్బీనగర్ లోని తన క్యాంప్ కార్యాలంలో అభినందించి, రివార్డు అందజేశారు. వైష్ణవి.. అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసుకుని 2024 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. సీపీ వెంట ఎల్బీనగర్ సీఐ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.