08-12-2025 09:36:44 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): గానుగుబండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూపతి వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు 20 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా మాజీ ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్ కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కంచర్ల కుశలవ రెడ్డి కట్ల చంద్రయ్య పంజాల యాదగిరి గుండ గాని వీరయ్య బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వెంకటమ్మ కరుణార్ వెంకటమ్మ మూడవ నాలుగవ వార్డు మెంబర్ల అభ్యర్థులు చిటుకుల సోమయ్య మాతంగి పరుశ రాములు బీఆర్ఎస్ నాయకులు గుండగాని వీరయ్య పరశురాములు కమలాకర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.