12 April, 2026 | 2:03 AM

అంతరిక్షంలో ఎన్నో అడుగులు

12-04-2026 12:00 AM

నేడు అంతర్జాతీయ మానవ అంతరిక్షయాన దినోత్సవం :

1961లో యూరీ గగారిన్ చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు గుర్తుగా ఏటా ఏప్రిల్ 12న అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2011 నుంచి ఐరాస నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. అంతరిక్ష సాంకేతికత, శాస్త్రీయ ప్రగతి, అంతరిక్ష యాత్రల్లో ఎదురవుతున్న సవాళ్లు, అంతరిక్షయాత్రల్లో మానవులను వివిధ గ్రహాలు, ఉపగ్రహాలకు పంపించి పరిశోధనలు జరపడం, మానవాళి అంతరిక్ష రహస్యాల శోధనలు, గత కొన్ని దశాబ్దాలుగా వాయువేగంతో కొన సాగుతున్నది.

మానవ సహిత అంతరిక్షయాత్రల ద్వారా మానవాళి శ్రేయస్సు, సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కృషి జరుగుతున్నది. కాగా, 1961 ఏప్రిల్ 12న సోవియట్ యూనియన్ వ్యోమగామి యూరీ గగారిన్ ‘వేస్టోక్ 1’ అంతరిక్ష నౌకలో భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

ఈ చారిత్రాత్మక యాత్ర అంతరిక్ష పరిశోధనలకు మార్గం సుగమం చేసింది. 1957 అక్టోబర్ 4న స్పుత్నిక్ -1 ఉపగ్రహాన్ని అంతరిక్షంపైకి ప్రయోగించారు. ఇలాంటి ఎన్నో అంతరిక్ష విజయాలను ఈ సందర్భంగా మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి,

9949700037