28-05-2025 01:04:48 AM
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
కడపలో అట్టహాసంగా టీడీపీ మహానాడు కార్యక్రమం
పార్టీ భవిష్యత్ కోసం మంత్రి లోకేశ్ 6 శాసనాల ప్రకటన
కడప, మే 27: 2024 ఎన్నికల్లో 93 శాతం స్ట్రుక్ రేట్‌తో టీడీపీ ఘన విజయం సాధించిందని, దీని ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలే కారణమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబా బునాయుడు కొనియాడారు. ఏపీలోని కడపలో మూడురోజులపాటు జరగనున్న 43 వ మహానాడు కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
ఈసందర్భం గా చంద్రబాబు మాట్లాడుతూ.. 43ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని, వైసీపీ విధ్వంస పాలనలో టీడీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారన్నారు. అయినా కార్యకర్తలు పోరాటం చేశారని, ప్రత్య ర్థులు చంపుతున్న జై తెలుగుదేశం అని నినదించిన చంద్రయ్య లాంటి కార్యకర్తలే మన కు స్ఫూర్తి అని, ఆ స్ఫూర్తే టీడీపీని నడిపిస్తోందని అన్నారు.
రాష్ట్ర భవిష్యత్‌కు 6 శాసనాలు:లోకేశ్
తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీ పీ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీకి ప్రతిపక్షం కొత్తకాదని, అధికారం కొత్త కాదని, పార్టీ భవిష్యత్ కోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నానన్నారు.
అవి 1. తెలుగుజాతి విశ్వఖ్యా తి 2. యువగళం 3. స్త్రీశక్తి 4. పేదల సేవల్లో సోషల్ రీఇంజినీరింగ్ 5. అన్నదాతకు అండ గా 6. కార్యకర్తలే అధినేత. అన్ని రంగాల్లో తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలని, పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని చెప్పారు.