calender_icon.png 26 November, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

28 మంది మావోయిస్టుల లొంగుబాటు

26-11-2025 12:29:23 AM

  1. వీరిలో పీఎల్జీఏ, జనతన్ సర్కార్ సభ్యులు
  2. అందరి తలలపై రూ.89 లక్షల రివార్డు
  3. వివరాలు తెలిపిన బస్తర్ ఐజీ సుందర్‌రాజ్

చర్ల/ రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తార్ ప్రాంతానికి చెందిన 28 మంది మావోయిస్టులు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్‌పూర్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి మావోయిస్టు పార్టీ మాడ్ డివిజన్ కమిటీ సభ్యులు, పీఎల్జీఏ, ఏరియా కమిటీ సభ్యులు, ఒక మిలటరీ దళ కమాండర్లు, ఎల్వోఎస్, జనతన్ సర్కార్ సభ్యులు లొంగిపోయారు.

వీరందరి తలపై రూ.89 లక్షల మేర రివార్డు ఉంది. ఎస్పీ రాబిన్సన్ గుడియా మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులనుంచి సెల్ఫ్-లోడింగ్ రైఫిల్, ఇన్‌సాస్ అసాల్ట్ రైఫిల్, 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మిగిలిన వారు కూడా జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.