26-11-2025 12:28:01 AM
దక్షిణాదిపై తుఫాన్ ప్రభావం
తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అయి అది వాయిగుండంగా రూపాంతరం చెందుతున్నది. తత్ఫలితంగా దక్షిణాదిపైకి ‘సెన్యార్’ తుఫాన్ ముంచుకొస్తున్నది. ప్రస్తుతం మలేషియా, మలక్కా జలసంధి పరిసరాల్లో మొదలైన వాయుగుండం 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.
తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఈ నెల చివరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాను తీరం దాటేంత వరకు మత్స్యకారులేవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో గంటకు 45 50 కి.మీ మేర బలమైన గాలులు వీస్తాయని, తీర ప్రాంత జనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యంత్రాంగం అందుబాటులో ఉండాలని సూచించింది.