calender_icon.png 26 November, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గార్గ్‌ది కూట్రపూరిత హత్యే

26-11-2025 12:30:58 AM

అసెంబ్లీలో వెల్లడించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

దిస్పూర్, నవంబర్ 25 : ‘ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించలేదు.. ఆయనను కుట్రపూరింతగా హత్య చేశారు’. అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. సెప్టెంబర్ 19న జుబిన్ సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, జుబిన్ మరణంపై చర్చించడానికి ప్రతిపక్షాలు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

నేరం వెనుక ఉన్న ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తుందన్నారు. నిందితుల్లో ఒకరు ఆయనను హత్య చేయగా, మిగిలిన వారు అతడికి సహకరించారని దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్యతో సంబంధమున్న ఐదుగురు వ్యక్తులపైన పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. డిసెంబర్‌లో ఛార్జిషీట్ సమర్పించిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారని తెలిపారు.

మరో వైపు జుబిన్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ఏకసభ్య కమిషన్ వాంగ్మూలాలు నమోదు చేయడానికి, మరిన్ని సాక్ష్యాలు సమర్పించడానికి దర్యాప్తును డిసెంబర్ 12 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసుపై సింగపూర్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం

జుబిన్ గార్గ్‌ను ఆయన మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజర్ విషమిచ్చి దానిని ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని జుబిన్ బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. జుబిన్ నోరు, ముక్కు నుంచి నురగ వస్తున్నప్పుడు కూడా మేనేజర్ కంగారు పడలేదని తెలిపారు. వెంటనే వైద్య చికిత్స అందించకుండా ఆలస్యం చేశారని ఆరోపించారు.