23-01-2026 12:00:00 AM
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది తమన్నా భాటియా. ఒకప్పుడు అగ్ర కథానాయకుల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే ప్రత్యేక గీతాల్లో నటించడం ప్రారంభించింది. తనను తాను నిరూపించుకొని కమ్‌బ్యాక్ ఇచ్చే ఓ శక్తిమంతమైన పాత్ర తమననా ఖాతాలో పడిందిప్పుడు. బాలీవుడ్‌లో ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో జాన్ అబ్రహం హీరోగా ‘మారియా ఐపీఎస్’ అనే సినిమా రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై ఇండోర్‌లో జరుగుతున్నట్లు సమాచారం. ఇదొక బయోపిక్. ఈ కథ బలమైన భావోద్వేగాల చుట్టూ తిరుగుతుందని నిర్మాతలు ఇప్పటికే తెలియజేశారు. 1993లో డిప్యూటీ కమిషనర్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసిన రాకేశ్ మారియా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ముంబై వరుస పేలుళ్ల కేసును పరిష్కరించడంలో రాకేశ్ మారియా కీలక పాత్ర పోషించారు.
ముఖ్యంగా 2003 గేట్‌వే ఆఫ్ ఇండియా, జవేరి బజార్ జంట పేలుళ్ల కేసును ఛేదించడంలో మారియా కీలక పాత్ర పోషించారు. టాక్సీల్లో పేలుడు పరికరాలను అమర్చిన జంటతో సహా మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన ఘనత మారియాది. ఈ బయోపిక్‌లో టైటిల్ రోల్‌ను జాన్ అబ్రహం పోషిస్తుండగా.. తమన్నా ఆయన భార్య పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. తమన్నా పాత్ర ఎంతో ప్రభావ వంతంగా ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది.