calender_icon.png 17 October, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

16-10-2025 01:06:24 AM

-అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం, చికిత్స పొందుతూ మరొకరు..

-స్కూటీపై వెళ్తున్న వారిని ఢీ కొట్టిన టిప్పర్ 

-మృతుల్లో ఇద్దరు ఐదేళ్ల చిన్నారులు

-భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఘటన 

కామారెడ్డి, అక్టోబర్ 15 (విజయక్రాం తి):రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసు కుంది. బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రా మం స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చి న టిప్పర్ లారీ, ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు.

మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.స్థానికుల సమాచారం మేరకు కామారెడ్డి నుంచి భిక్కనూరు వైపు వెళ్తున్న స్కూటీని ఎదురుగా రాంగ్ రూ ట్‌లో దూసుకొచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టిం ది. స్కూటీపై తాత, తల్లి, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలోనే ఆరేళ్ల బాలుడు, తల్లి మృ  చెందగా, తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన తాత, చిన్నారుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

మరణించిన వారి లో కిషన్ (53), జస్లిన్ (29), జోయెల్ ప్రకా ష్ (4), జోయెల్ జడ్సన్ (5 నెలల శిశువు)గా గుర్తించారు. కిషన్ అదిలాబాద్ జిల్లా వాసి కాగా, జస్లిన్ మరియు ఇద్దరు చిన్నారులు ఖ మ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందినవారని అధికారులు పేర్కొన్నారు.ఈ దుర్ఘటనపై బిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.