calender_icon.png 21 January, 2026 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు...

21-01-2026 06:23:11 PM

కలశాలతో మహిళలు భారీ ర్యాలీ...

మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల

బాన్సువాడ,(విజయక్రాంతి): శ్రీ భక్త మార్కండేయ జయంతి పండుగను పురస్కరించుకుని బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు, పట్టు వస్త్రాలతో అలంకరణ, హారతి మంత్రపుష్పం ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మహిళలు కలిశాల తో బాన్సువాడ పట్టణంలో ఆలయం నుండి తాడుకోల్ చౌరస్తా మీదుగా భార్య ర్యాలీ నిర్వహించారు.

అనంతరం మార్కండేయ జనన కార్యక్రమం నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

అదేవిధంగా బిజెపి, బిఆర్ఎస్ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ఆలయ కమిటీ అధ్యక్షులు గూడ శ్రీనివాస్, పద్మశాలి సంఘం అధ్యక్షులు లక్క శ్రీనివాస్, కాలభైరవ స్వామి ఆలయ చైర్మన్ శంకర్, సంఘ సభ్యులు రామచందర్, బాలరాజు, బాలకృష్ణ, నరహరి,అనిల్, రమేష్,సాయిలు, పండరి, మహిళ సంఘం సభ్యులు, యువజన సంఘం సభ్యులు, సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.