12-11-2025 04:52:10 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరోసా సెంటర్లో వివిధ కారణాల వల్ల విడిపోయిన దంపతులను తిరిగి కలిపేందుకు వెలుగనిద్దాం దాంపత్య జీవితం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీవాణి హాజరై మనస్పర్ధల వల్ల విడిపోయిన దంపతులను అభినందించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల అనేక దంపతుల కుటుంబాలు తిరిగి ఒకటి కావడం అభినందనీయమని పేర్కొన్నారు.
చిన్న చిన్న మనస్పర్థల వల్ల ఇద్దరి దంపతుల మధ్య ఏర్పడిన గొడవలను కౌన్సిల్ ద్వారా పరిష్కరించి వారిని కలిపేందుకు పోలీస్ శాఖ భరోసా సెంటర్ ను ఏర్పాటు చేసి 110 జంటలను ఇప్పటివరకు తిరిగి కలపడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. భరోసా సెంటర్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్ఐలు మహిళా పోలీసులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.