12-11-2025 04:48:28 PM
బార్ కౌన్సిల్ అభ్యర్థి పొన్నం అశోక్ గౌడ్..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, మాజీ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్, పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ గౌడ్ బుధవారం సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. బార్ కౌన్సిల్ ఎన్నికలలో మద్దతు ఇచ్చి తనను గెలిపించాలంటూ అశోక్ గౌడ్ న్యాయవాదులను కోరారు.
ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదులకు అందించే డెత్ బెనిఫిట్ ను రూ.లు 15 లక్షలు చెల్లించెందుకు, న్యాయవాదులకు ఆరోగ్య భీమా సౌకర్యాన్ని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచడానికి, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
బార్ కౌన్సిల్ సభ్యులుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని న్యాయవాదులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎజిపి దూడం ఆంజనేయులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, న్యాయవాదులు భూసారపు బాల కిషన్ ప్రసాద్, మడూరి ఆంజనేయులు, ఆవుల లక్ష్మీ రాజం, పడాల శ్రీరాములు, జోగుల రమేష్, అవునూరి సత్యనారాయణ, కోడం అజయ్, సామల రాజేంద్ర ప్రసాద్, ఆవుల శివకృష్ణ, గుడ్ల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.