10 March, 2026 | 4:47 PM

అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

18-09-2025 12:45 AM
  1. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి 

నగరంలోని 1వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన 

ఖమ్మం, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): అభివృద్ధి కి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్ర త్యేక దృష్టి పెట్టి, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమా చార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ పరిధిలోని 1వ డివిజన్ కైకొండాయగూడెం లో సిసి రోడ్ల నిర్మాణ పనులకు, మంత్రి, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి శంఖుస్థాపన చేశారు.

మునిసిపల్ సాధారణ నిధులు రూ. 133.4 లక్షల వ్యయంతో 6 సిసి రోడ్లు, రూ. 176.1 లక్షల వ్యయంతో 9 సిసి రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 1వ డివిజన్ లోని మారుతినగర్, బాలాజినగర్ లలోని 8 కాలనీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రా గానే ఈ కాలనీల అభివృద్ధి కి పనులు చేపట్టినట్లు తెలిపారు. మళ్లీ వర్షాకాలం వచ్చే లోగా డివిజన్ లో అన్ని సిసి రోడ్లు పూర్తి చేస్తామన్నారు. సిసి రోడ్ల పూర్తి పిదప డ్రెయిన్ల నిర్మాణాలు చేస్తామన్నారు. 

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగులేకున్నా, ఇచ్చిన ఒక్కొక్క మాటను ప్రజా ప్రభుత్వం అమలుచేస్తుందని, భవిష్యత్తులో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి అన్నారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, నగరపాలక సంస్థ డిఇ ధరణి కుమార్, ఏఇ నరేంద్ర తేజ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యకరమైన కుటుంబాలు, సాధికారత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం..

ఖమ్మం, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): ఆరోగ్యకరమైన కుటుంబాలు, సాధికారత స మాజాల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా సరెడ్డి అన్నారు. స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమ అమలుకు పైలెట్ మండలంగా తిరుమలాయపాలెం మండలంలో బుధవారం కార్యక్రమాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ లతో కలిసి తిరుమలాయపాలెం ఏరియా ఆసుపత్రి వద్ద ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తుందని అన్నా రు. ఈ రెండు రంగాలకు పుష్కలంగా ని ధులు వెచ్చించి, పేదవారిప్రభుత్వం ఆడబిడ్డలకు అన్ని విధాలుగా అండదండలు అంది స్తుందన్నారు. ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఆడబిడ్డలకు ఎటువంటి ఇ బ్బంది, బాధలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వైద్యాధికారులు, సిబ్బంది దేవుళ్ళతో సమానమని, భగవంతుని రూపమని, రోగులకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలన్నారు. పేదవారికి, ధనికులతోపాటు మెరుగైన వైద్య సేవలు అందాల న్నారు. తిరుమలాయపాలెం ఏరియా ఆసుఅత్రి 30 పడకల నుండి 50 పడకల కు అప్ గ్రేడ్ అయిందన్నారు.

ఆసుపత్రిలో క్రొత్త స్కానింగ్, ఎక్స్-రే మిషన్లు, డెంటల్ చెయిర్ నెలాఖరుకు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు.మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు చేపట్టిన ఈ కార్యక్రమం 15 రోజుల కార్యక్రమంలా కాకుండా చిత్తశుద్ధి తో చేపట్టాలని మంత్రి అన్నారు.కార్యక్రమంలో జి ల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, స్వస్థ నారీ - సశక్తి పరివార్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు.

ఇట్టి కార్యక్ర మం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు చేపడతారని అన్నారు. ఆశాలకి లక్ష్యాలను ఇచ్చి, ప్రతి ఒక్క మహిళ, పిల్లలు పరీక్షలు చే యించుకొనేలా చైతన్యం తేవాలన్నారు. వ్యా ధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జీవనశైలి వ్యాధులు పూర్తిగా ముది రేదాక తెలియదని, సమస్యలు ఉన్నా లేకు న్నా పరీక్షల ద్వారా తెలుస్తుందని అన్నారు. అంతకుముందు మంత్రి, ఏరియా ఆసుపత్రి తనిఖీ చేశారు. ఫార్మసీ, ఏఎన్సి ఓపి, మెడికల్ ఓపి, క్యాజువాలిటి విభాగాలను సంద ర్శించి, రోగులకు అందుతున్న సేవలను అడి గి తెలుసుకున్నారు.

రోగులతో మంత్రి ఆసుపత్రి లో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి భవనంలో లీకేజుల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలన్నారు. ఆసుపత్రిలో కావాల్సిన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని సదుపాయాల కల్పన చేయనున్నట్లు, మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం కల్గించాలన్నారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, డిసిహెచ్‌ఎస్ డా. రాజశేఖర్, డిప్యూటీ డిఎం&హెచ్‌ఓ డా. చందు నాయక్, వైద్యాధికారులు డా. కృపా ఉషశ్రీ, డా. శ్రీనివాసరావు, డా. వైదేహి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పీఆర్ ఎస్‌ఇ వెంకట్ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, తిరుమలాయపాలెం మండల తహసీల్దార్ విల్సన్, ఎంపిడివో సిలార్ సాహెబ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.