calender_icon.png 13 August, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగం

11-08-2025 01:47:06 AM

- కార్పొరేటర్ ఆకుల శ్రీ వాణి

ముషీరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఖేలో ఇండియా అస్మిత ఉమెన్స్ తైక్వాండో లీగ్-2025 ను తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో  ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై  ప్రారంభించారు.

ఈ ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీవాణి  మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణకే కాకుండా శారీరకదారుధ్యానికి,  మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు. ఈ మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో సుమారు 300 మంది ఉమెన్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడల్లో విజయం సాధించిన పలువురి క్రీడాకారులకు  బహుమతులు, మెడల్స్ అందజేశారు.  ఈ కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షులు గుర్రం కృష్ణ, కార్యనిర్వహక సెక్రెటరీ సరబ్ సంతోషి, జనరల్ సెక్రెటరీ మీర్ వహజ్ హలీ ఖాన్, కోశాధికారి, మారుతి;వరప్రసాద్,  టెక్నికల్ కమిటి చైర్మన్ నరసింహ, ఎడ్యుకేషన్ కమిటి చైర్మన్ సోమ విజయ్ కుమార్, రవి కుమార్, కృష్ణ పాల్గొన్నారు.