11-08-2025 01:48:13 AM
ముషీరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): భోలక్ పూర్ డివిజన్ రంగానగర్ బొంతల బస్తీలో ఆదివారం శ్రావణమాసం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉన్న కట్టమైసమ్మ, నల్ల పోచమ్మ దేవాలయాలలో అమ్మవారికి భక్తులు బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎం. అరవింద్ కుమార్ యాదవ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకుడు నర్సింగ్ రావు అతిథులను శాలువాలతో సన్మానించారు. అనంతరం బోనాల ఊరేగింపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీ పెద్దలు అశోక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.