calender_icon.png 20 August, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్వాడీ వ్యాపారుల గో బ్యాక్ నినాదం సరికాదు

20-08-2025 01:35:19 AM

  1. నిజాం కాలం నుంచి వారిక్కడ వ్యాపారాలు చేస్తున్నారు 

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): నిజాం కాలం నుంచి మార్వాడీ వ్యాపారులు ఇక్కడే ఉంటున్నారని, ఇప్పుడు మార్వాడీల గో బ్యాక్ అనడం సరికాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిలయ న్స్, డీ మార్ట్ లాంటి బడా కంపెనీల్లో అన్ని వస్తువులు దొరుకుతున్నాయని, మరి వాళ్లనెందుకు తిరిగి వెళ్లమనడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నదని, ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి బతుకుతున్నారని వివరించారు. ఇలాంటి సందర్భం లో గో బ్యాక్ అంటే రాష్ట్రాభివృద్ది కుంటుపడుతుందని పేర్కొన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.