20-08-2025 01:35:29 AM
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ నాంపల్లి సంకేపల్లి రైల్వే బాధితులు మంగళవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిశారు. ఈ సందర్భంగా రైల్వే బాధితుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బాధితులకు న్యాయం జరగలేదని, ప్రస్తుతం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. గత ఏడు సంవత్సరాలుగా రైల్వే బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, శ్రీనివాస రావుతో పాటు రైల్వే బాధితులు ఉన్నారు.