18 April, 2026 | 2:27 PM

సామూహిక ‘వందేమాతరం’ గీతాలాపన

25-11-2025 12:00 AM

కోరుట్ల:నవంబర్24(విజయక్రాంతి) భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ మరియు అభియాన్ జిల్లా కోకన్వీనర్ సుధవేణి మహేష్ ఆధ్వర్యంలో వందేమాతరం గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కోరుట్ల లోని స్థానిక సరస్వతీ శిశు మందిర్ హైస్కూల్లో సామూహిక వందేమాతర గీతాలా పన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నమనేని వికాస్ రావు జగిత్యాల భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారు రచించి న ఈ గేయం మన దేశ స్వాతంత్ర పోరాటంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణ నినాదం లో నిలిచిందని .

ఈ గేయం ఉద్యమ స్ఫూర్తితో మన దేశాన్ని నడిపిందని ఈ గేయం ఆంగ్లేయులను మన దేశం నుండి పారదోలేందుకు మన స్వాతంత్ర సమరయోధులకు ఎంతో ధైర్యాన్ని నింపిందని అందుకే ఈ 150 సంవత్సరాల సందర్భంగా ఈ గేయాన్ని ప్రతి పల్లె పల్లెకు ప్రతి పౌరునికి ప్రతి విద్యార్థి విద్యార్థులకు చేరే విధంగా ప్రతి ఒక్కరి మదిలో దేశభక్తి నింపె విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారని అందుకే ప్రతి ఒక్కరు కూడా మన దేశం కొరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.

ఇట్టి కార్యక్రమంలో అభియాన్ కన్వీనర్ సుధవేని మహేష్ పట్టణ ప్రధాన కార్యదర్శిలు చెట్ల పెళ్లి సాగర్ ఎర్ర రాజేందర్ పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివ్, మాజీ కౌన్సిలర్ మాడవేని నరేష్ & పెండం గణేష్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెళ నవీన్ సాడిగే మహేష్, సీనియర్ నాయకులు మాసం ప్రసాద్, రాచమడుగు శ్రీనివాసరావు తిరుమల వాసు,గందె నవీన్,గిన్నెల శ్రీకాంత్, తోట రాజేశం, గుద్దేటి రాజేందర్, రాధారపు సత్యనారాయణ,ఓం ప్రకాష్, మల్లేష్, మ్యాకల గణేష్, కంఠం శ్రీనివాస్, రాగం శెట్టి సాయి కృష్ణ కథలాపూర్ మండల సీనియర్ నాయకులు బిజెపి నాయకులు బూత్ ప్రెసిడెంట్ మరియు బీజేవైఎం నాయకులుపాల్గొన్నారు.