24-11-2025 11:07:43 PM
పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ రూ. 26 లక్షల నిధులతో నూతన హంగులు దిద్దుకుంటుందని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. కమ్యూనిటీ హాల్ లోని లోపాలను సవరించి, లైట్లు, ఫ్యాన్లు, మరుగు దొడ్లు రిపేర్లు చేయించి, రంగులు వేయించి త్వరలో డివిజన్ ప్రజల అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. పునరుద్ధరణ పనులు నత్తనడక సాగుతున్నాయన్న స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం కార్పొరేటర్ జిహెచ్‌ఎంసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీత, అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్, కాంట్రాక్టర్ బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ బీజేపీ నేతలు జవహర్ నగర్ వ్యాయామశాల ఆటస్థలం, కళ్యాణ మండపం పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి పనులను పర్యవేక్షించారు.
అభివృద్ధి పనులకు కలిగిన ఆలస్యంపై అరా తీశారు. పనుల్లో ఏటువంటి ఆలస్యం కలగడానికి వీల్లేదని, పనులను నత్తనడకన జరపడం సబబు కాదని కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో మరో 15 రోజుల్లో మరమత్తులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, దామోదర్, శ్రీకాంత్, పి. నర్సింగ్ రావు, ఎం. ఉమేష్, శివకుమార్, సురేష్ రాజు, ఆనంద్ రావు, శ్రీనివాస్ యాదవ్, నీరజ్, జ్ఞానేశ్వర్, జవహర్ నగర్ వ్యాయామశాల ఆటస్థలం, కళ్యాణ మండపం పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు నర్మెట్ట మల్లేష్, గుండు జగదీష్, జి. మహేందర్ తదితరులు పాల్గొన్నారు.