700 తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత!
ఫారో దీవుల్లో గ్రైండాడ్రాప్ సంప్రదాయంపై సీ ఫెషర్డ్ పర్యావరణ సంస్థ ఆగ్రహం
ఫారోస్, జూన్ 4: సంప్రదాయం పేరుతో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లను ఊచకోత కోయడం పట్ల ప్రకృతి, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఇది అనాగరికమైన చర్యగా అభివర్ణిం చారు. నార్త్ అట్లాంటిక్ సముద్రంలోని ఫా రో దీవుల్లో స్థానిక సంప్రదాయమైన ‘గ్రైం డాడ్రాప్’లో భాగంగా ఒక్కరోజులోనే భారీ సంఖ్యలో తిమింగలాలు, డాల్ఫిన్లను మే 27 న ఊచకోత కోశారు. దీంతో సముద్రం ఎర్ర గా మారిపోయింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సీ షెఫర్డ్ అనే పర్యా వరణ సంస్థ ప్రచార వాలెంటి నా క్రాస్ట్ ఈ వివరాలను గురువారం మీడియాతో పంచు కుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టోర్షావన్ లో సాండెగెర్డి బే వద్ద 402 పైలట్ తిమింగ లాలను, నాలుగు బాటిల్నోస్ డాల్ఫిన్లను ఒడ్డుకు తీసుకొచ్చి వాటి శరీరా న్ని వేటగాళ్లు చీల్చారు. స్కాలబోట్నూర్‌లో 168 వైట్ సైడెడ్ డాల్ఫిన్లు, హాల్విక్‌లో 132 వైట్ సైడెడ్ డాల్ఫిన్లను చంపేశారు. వాటిని చంపేందుకు ఆయుధాల కొరత ఏర్పడడం తో కొక్కేలు, కత్తులు కూడా ఉపయోగించి వాటి శరీరాల ను చీల్చేశారు.
దీంతో అవి విలవిలా కొట్టు కొని ప్రాణాలు వదిలాయి. ఈసంప్రదాయా న్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆధునిక కాలంలో అనాగరిక చర్య, కాలం చెల్లిన పద్ధతిగా అభివర్ణించారు. వెంటనే దీ న్ని ఆపేలా స్థానిక ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని యూరప్ వ్యాప్తంగా ఉన్న దేశాల ప్రభుత్వాలను వాలెంటినా క్రాస్ట్ డిమాండ్ చేశారు. కాగా ఒక రోజు ముందే ఫారోస్ పార్లమెంట్‌లో వేటాడే డాల్ఫిన్ల కోసం ఉన్న సంక్షేమ చట్టాన్ని సవరించడం గమనార్హం.






