మంచం కింద నక్కిన టీఎంసీ నేత
- ఇండ్లిప్పిస్తామని స్థానికులను మోసం
- ఇంటికొచ్చి నిలదీయగా చేతులెత్తేసిన షాహిదుల్ మియా
- ఇంటిని ముట్టడించిన ప్రజలు
- వీడియోను షేర్ చేసిన బీజేపీ
కోల్‌కతా, జూన్ 4: పశ్చిమ బంగాల్ రాష్ట్రంలో అవినీతి వ్యవహారాలు పొలిటికల్ డ్రామాను తలపిస్తున్నాయి. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారుల నుంచి అక్రమంగా వసూలు చేసిన ‘కట్ మనీ’ వ్యవ హారంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన షాహిదుల్ మియా నేతకు వింత పరిస్థితి ఎదురైంది. బాధితులు, స్థానిక ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి ఆయన తన ఇంట్లోని మంచం కింద దాక్కున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడి యోను బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ గురువారం సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్ అయింది. పశ్చిమబంగాల్‌లో ‘కట్-మనీ కుంభకోణం’లో టీఎంసీ లీడర్ల బాగోతాలు ఒక్కొక్క టి బయట పడుతున్నాయని అన్నారు. టీ ఎంసీ ప్రభుత్వ హయాంలో బెంగాల్‌లో అవినీతి పరాకాష్టకు ఈ దృశ్యాలే నిదర్శనమని ఆయన విమర్శించారు.
కూచ్ బెహార్ జిల్లాలోని మాతాభంగా ప్రాంతానికి చెందిన టీ ఎంసీ నేత షాహిదుల్ మియా ఇంటిని స్థాని క ప్రజలు పెద్ద ఎత్తున ముట్టడించారు. ప్రభుత్వ ఇళ్ల కేటాయింపుల పేరుతో ఆయ న ఒక్కొక్కరి నుంచి రూ.5వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. తమకు ఎటువంటి ల బ్ధి చేయలేదని, తమ డబ్బు తిరిగివ్వాలని తీ వ్ర ఆగ్రహంతో ప్రజలు ఇల్లు ముట్టడించా రు. దీంతో ప్రాణభయంతో ఆయన పడకగదిలోని మంచం కింద దూరి దాక్కున్నారు.
చివరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మంచం కింద నుం చి ఆయనను బయటకు లాగి రక్షించాల్సి వచ్చింది. అయితే ఈ వీడియో నిజానిజాలను తాము స్వతంత్రంగా ధ్రువీకరించ లేదని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. బెంగా ల్ వ్యాప్తంగా కాక్‌ద్వీప్, నామ్‌ఖానా, మాతాభంగా ప్రాంతాలలో ప్రస్తుతం ఇదే తరహా అవినీతి, భయాందోళ నలు కనిపిస్తున్నాయని అమిత్ మాలవీయ ఎద్దేవా చేశారు.
దర్యాప్తు సంస్థల నిఘా పెరగడం, అరెస్టులు ప్రారంభం కావడంతో పేదలను దో చుకున్న నాయకులకు ఇప్పుడు మంచాల కింద కూడా చోటు దొరకడం లేదని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధి కారంలోకి వచ్చిన తర్వాత, గతంలో కట్‌మనీ వసూలు చేసిన స్థానిక నేతలపై ప్రజల నుంచి ఒత్తిడి తీవ్రమైంది. దీనితో కొందరు నేతలు తాము తీసుకున్న డబ్బుల ను బాధితులకు తిరిగి ఇచ్చేస్తున్నారు.
ఇలాంటిదే మరో ఘటనలో దక్షిణ 24 పరగణాల జిల్లా నామ్‌ఖానా పరిధిలోని పాతిబునియా గ్రా మానికి చెందిన ఒక టీఎంసీ పంచాయతీ సభ్యుడు 45 మంది గ్రామస్థులకు రూ. 5వేల చొప్పున వసూలు చేసిన డబ్బును వెనక్కి ఇచ్చేశారు. దీంతో ఎలాంటి సంబం ధం లేదని టీఎంసీ తెలిపింది. గ్రామస్థులు లేదా వ్యాపారుల నుంచి కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా చేసిన వసూళ్లను పార్టీ ఖాతాలో వేయవద్దని స్పష్టం చేసింది.






