చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం..
గట్టుప్పల్లో భారీగా చెక్కుల పంపిణీ& రూ.1.45 కోట్లకు పైగా సహాయం
గట్టుప్పల్ మండల ఏర్పాటు నా రాజీనామా పుణ్యమే
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు(గట్టుప్పల్) ఏప్రిల్ 10: చేనేత కార్మికుల ఆత్మ గౌరవానికి అండగా నిలిచి వారి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు వెంటనే ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలో చేనే త కార్మికులకు రుణమాఫీ చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు.నేతన్నల బీమా పథకం కింద 7 మందికి రూ.35 లక్షల విలువైన చెక్కు లు అందజేయగా, చేనేత రుణమాఫీ పథకం కింద 141 మంది నేతన్నలకు రూ.1 కోటి 10 లక్షల 75 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
చిన్ననాటి నుంచే చేనేత కార్మికుల కష్టాలు తెలుసునని, తమ గ్రామం లో చేనేత కుటుంబాలతో కలిసి జీవించామని తెలిపారు. టెక్నాలజీ పెరుగుదలతో మ రమగ్గాలు రావడంతో నేతన్నల పరిస్థితి మ రింత దిగజారిందని అన్నారు. నాగరిక ప్రపంచంలో ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది నేతన్నలేనని, కానీ బట్టలు నేస్తున్న వారి జీవితం మాత్రం కష్టాల్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేతన్నల సమస్యలపై ప్రత్యేకం గా అధ్యయనం చేసి నివేదిక తయారు చేసి వారితో కలిసి ముఖ్యమంత్రిని కలుస్తానని హామీ ఇచ్చారు. పేదరికంలో ఉన్న చేనేత కా ర్మికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటుందని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాను వారి వెంట ఉంటానని స్పష్టం చేశారు. గట్టుప్పల్ మండల ఏర్పాటు తన రాజీనామా ఫలితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.




