11-09-2025 07:21:46 PM
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ(Maoist leader Modem Balakrishna alias Manoj)తో సహా ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ యారఫ్ పాండు కూడా మరణించారు. మెయిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో భద్రతా సిబ్బంది నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు కాల్పులు జరిగాయని రాయ్‌పూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమ్రేష్ మిశ్రా తెలిపారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా (Commando Battalion for Resolute Action) ఇతర రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొనగా.. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.